Tuesday, July 31, 2018

Council of Ministers - govt of AP

Sri. Nara Chandrababu Naidu
Constituency: Kuppam
Chief Minister,General Administration Department, Investment & Infrastructure, Minority Welfare & Empowerment, Cinematography, Happiness Index,Health, Medical Education & Family Welfare and Endowments and all other portfolios not allocated
Address : 1st Floor, Building-I, Velagapudi
Phone: 0863-2441521
Email:cm@ap.gov.in
Sri K.E.Krishna Murthy
Constituency: Pattikonda
Deputy Chief Minister,Revenue, Stamps & Registration
Address :
Room No:214 & 215, 1st Floor, Building-II ,Velagapudi
Email: dycm_rev@ap.gov.in
kekrishnamurthydycm@gmail.comPhone: 0863-2442600, 2442031
Sri N.Chinarajappa
Constituency:Peddapuram
Deputy Chief Minister,Home, Disaster Management
Address :
Room No:136, Ground Floor, Building-II,Velagapudi
Email: dycm&home@ap.gov.in, chinarajappa.dcm@gmail.com
Phone: 0863-2442149, 2442147
Sri Yanamala Ramakrishnudu
Constituency: MLC
Finance & Planning, Commercial Tax & Legislative Affairs
Address :
Room No:212 & 213, 1st Floor, Building-II,Velagapudi
Email: min_fin@ap.gov.in
Phone:0863-2442037, 2442020
Sri Nara Lokesh
Constituency: MLC
Panchayat Raj, Rural Development, Information Technology and Communications
Address :
Room No:188C,Ground Floor, Building – V,Velagapudi
Email:peshi-it-pr@ap.gov.in
Phone:0863-2445191, 2445993
Sri Kimidi Kala Venkata Rao
Constituency: Etcherla
Energy
Address :
Room No:211, 1st Floor, Building-II,Velagapudi
Email:energy.peshi@gmail.com
Phone:0863-2442572
Sri Atchannaidu Kinjarapu
Constituency: Tekkali
Transport, BC Welfare and Empowerment, Handlooms and Textiles
Address :
Room No:131, Ground Floor,Building-IV,Velagapudi
Email:katchannaidu@gmail.com
Phone: 0863-2444738
Sri R.V.Sujay Krishna Ranga Rao
Constituency: Bobbili
Mines & Geology
Address :
Room No:211,First Floor,Building-III,Velagapudi
Email: min-mines@ap.gov.in
Phone:
Sri CH.Ayyannapatrudu
Constituency:Narsipatnam
Roads and Buildings
Address :
Room No:193, Ground Floor, Building-V,Velagapudi
Email:mrbpeshi@gmail.com
Phone:0863-2445169, 2445199
Sri Ganta Srinivasa Rao
Constituency: Bhimili
Human Resources Development ( Primary Education, Secondary Education, Higher & Technical Education)
Address :
Room No:210, 1st Floor, Building-IV,Velagapudi
Email:min_hrd@ap.gov.in
Phone: 0863-2444747
Sri K.S. Jawahar
Constituency: Kovvur (SC)
Excise
Address :
Room No:127 , Ground Floor, Building-IV,Velagapudi
Email:jawaharmlakvr@gmail.com
Phone: 0863-2444993 
Sri Pithani Satyanarayana
Constituency: Achanta
Labour, Employment, Training and Factories
Address :
Room No:207, 1st Floor, Building-III,Velagapudi
Email:ministerpithani@gmail.com 
Phone:0863-2443920,2443760 
Sri Kollu Ravindra
Constituency:Machilipatnam
Law & Justice, Skill Development, Youth, Sports, Unemployment Benefits, NRI Empowerment and Relations
Address :
Room No:212, 1st Floor, Building-III,Velagapudi
Email: min_bchtex@ap.gov.inc
Phone:0863-2443739, 2443436
Sri Devineni Uma Maheswara Rao
Constituency: Mylavaram
Water Resources Management
Address :
Room No:212, 1st Floor, Building-IV,Velagapudi
Email: min_irrigation@ap.gov.in, icadpeshi@gmail.com
Phone:0863-2444369, 2444683
Sri Nakka Ananda Babu
Constituency:Vemuru (SC)
Social Welfare and Empowerment, Tribal Welfare and Empowerment
Address :
Room No:211, 1st Floor, Building-III ,Velagapudi
Email:ministernab@gmail.com
Phone: 0863-2443788 
Sri Prathipati Pulla Rao
Constituency:Chilakaluripet
Price Monitoring, Consumer Affairs, Food and Civil Supplies
Address :
Room No: 130, Ground Floor, Building-IV,Velagapudi
Email:mincivilsupplies@gmail.com
Phone: 0863-2444757
Sri Sidda Raghava Rao
Constituency: Darsi
Environment and Forests, Science and Technology
Address :
Room no: 130, Ground Floor, Building-IV,Velagapudi
Email: min_frst@ap.gov.in
Phone: 0863-2445739
Dr. P.Narayana
Constituency:MLC
Municipal Administration and Urban Development, Urban Housing
Address :
Room No:134 & 135, Ground Floor, Building-II,Velagapudi
Email:min_maud@ap.gov.in, apmunicipalminister@gmail.com
Phone: 0863-2442176, 2442187
Sri Somireddy Chandramohan Reddy
Constituency: MLC
Agriculture, Horticulture, Sericulture and Agri-Processing
Address :
Room No:133, Ground Floor, Building-IV,Velagapudi
Email:somireddy.agrimin@gmail.com
Phone: 0863-2444458 
Sri Ch. Adi Narayana Reddy
Constituency:Jammalamadugu
Marketing & Warehousing, Animal Husbandry, Dairy Development, Fisheries and Cooperatives
Address :
Room No:132, Ground Floor, Building-IV,Velagapudi
Email:agriculturemarketing@ap.gov.in
Phone: 0863-2444863 / 2444364 
Ms. Bhuma Akhila Priya
Constituency: Allagadda
Tourism, Telugu Language and Culture
Address :
Room No: 210, 1st Floor, Building-III,Velagapudi
Email:minister_tourism@ap.gov.in, ministerbhuma@gmail.com
Phone: 0863-2443747 
Sri Kalava Srinivasulu
Constituency: Rayadurg
Rural Housing and I&PR
Address :
Room No:211, 1st Floor, Building-IV,Velagapudi
Email:ministerkalava@gmail.com
Phone: 0863-2444682, 2444681
Smt.Paritala Sunithamma
Constituency: Raptadu
SERP, Women Empowerment, Child Welfare, Disabled and Senior Citizens Welfare
Address :
Room No:210, 1st Floor, Building-V,Velagapudi
Email:paritalasunitha.minister@gmail.com
Phone: 0863-2445299
Sri N. Amaranatha Reddy
Constituency: Palamaner
Industries, Food Processing , Agri Business, Commerce, and Public Enterprises
Address :
Room No: 208, 1st Floor,Building-IV, Velagapudi 
Email:narministerforindustries@gmail.com
Phone: — 
Latest New

మనం ఎక్కడ వున్నాం? లోపం ఎక్కడ వుంది?

మనం ఎక్కడ వున్నాం? లోపం ఎక్కడ వుంది? 
(ఈరోజు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి. ఈ సందర్భం పురస్కరించుకుని ఒక సందర్భంలో ఆయన చేసిన ఆంగ్ల ప్రసంగానికి స్వేచ్చానువాదం) 
ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 
అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన ‘అనుగ్రహ భాషణం’ ఇది. తెలుగుదనం కోసం, అనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం. 
చిత్తగించండి.- భండారు శ్రీనివాసరావు) 

“మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలు, మన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం. 
“పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశమే మొదటి వరసలో వుంది. 
“ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభం? వీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే. 
“ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు. 
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు ప్రచురించవన్న సంగతి అప్పుడే అర్ధం అయింది. 
“మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది. 
“ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న. 
“సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు. 
“అదేమిటంటే. విదేశీ వస్తువుల మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము. 
“ఆ మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను ‘జీవితంలో నీ లక్ష్యం ఏమిట’ని. ఆ అమ్మాయి బదులిచ్చింది. 'అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన భారత దేశంలో జీవించాలని వుంది’ అని. 
“ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత మనందరిమీదా లేదంటారా. ఆ కర్తవ్యం మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. 
“మరో విషయం. మనందరికీ ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారు, వీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము. 
“ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన జన్మ హక్కు అనుకుంటాము. 
“వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే. కానీ మనమేం చేస్తున్నాము? ఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా? 
“మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్! యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక. సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడతాము. ఏ షాపింగ్ మాలుకో, రెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదా, స్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు. 
“లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లి, నేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని నాకు బిల్లు పడకుండా చూడండి’ అని అడిగే ధైర్యం చేయం. 
“వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసి, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!’ అంటూ హుంకరించం. లేదా ‘నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో’ అని ఆమ్యామ్యా పైసలు చేతిలో పెట్టే తెగింపు చేయం. 
“అలాగే, ఆస్త్రేలియాలోనో, న్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూ, తాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం. వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి బిన్ లో వేసికాని రాము. 
“టోకియోలో పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా ? బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమా? విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే! కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా? 
“ఎందుకంటే, మనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే కనిపెట్టి చూడాలని కోరుకుంటాం. 
“వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే సిబ్బందికి కూడా మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది. 
“ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని ఆపగలవారు, అడ్డగలవారు వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. ‘పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. ‘దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూ’ అంటూ అని ధర్మపన్నాలు వల్లిస్తాం. 
“మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడం? దానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను, సమాజాన్ని క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరు? పక్కింటివాళ్ళు, ఎదురింటివాళ్ళు, మన కాలనీవాళ్లు, వూళ్ళో వున్న పౌరులు, లేదా మునిసిపాలిటీ, ప్రభుత్వం, ప్రభుత్వ అధికార్లు. అంతే. మనం కాదు. ఈ వ్యవస్తలో మనం మాత్రం వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా, కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ‘ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారా’ అని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతే, విమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని, వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరం, ఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితే, అంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి. 
“ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం. 

“భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.” (14-08-2012)

విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్

విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్
• విద్య ద్వారానే సమాజంలో మార్పు
• అమరావతి కొద్ది కాలంలోనే విజ్ఞాన కేంద్రం గా మారుతుంది
• విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్
అమవరావతి:
జీవితంలో కష్టపడటం మరియు నిజాయితీగా ఉండటం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని విఐటీ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్ చెప్పారు.ప్రతిష్టాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయం మిచిగన్ –డియర్ బోర్న్ తో కలిసి విఐటీ –ఎపి ప్రారంబించిన బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు మరియు వివిధ ఇంజనీరింగ్ కోర్సుల మొదటి సంవత్సరం తరగతులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి, ఈ సందర్భంగా మాట్లాడిన విఐటీ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్ డియర్ బోర్న్ యూనివర్సిటీలో ఒప్పందంలో భాగంగా విద్యార్ధులు అమెరికాలో కూడా ఈ కోర్సు చదువుకునే అవకాశం ఉందని రెండు సంవత్సరాలు ఇక్కడ ఒక సంవత్సరం అమెరికాలో చదువుకోవచ్చని దీని కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్ సదుపాయం కూడా ఉందని తెలిపారు,ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ ,ఫ్లేమ్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసిన డాక్టర్ ఇందిరా జే పరీఖ్ ని విఐటీ-ఎపి బిజినెస్ స్కూల్ అడ్వైజర్ గా లిబరల్ ఆర్ట్స్ లో ఇందిరా పరేఖ్ కి ఉన్న అనుభవం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని విఐటీ –ఎపి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాధన్ తెలిపారు.ప్రస్తుతం మార్కెట్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి డిమాండ్ బాగా ఉందని విఐటీ –ఎపి బిజినెస్ స్కూల్ ద్వారా విద్యార్ధుల ఎదుగుదలకు మంచి పునాది పడుతుందన్న నమ్మకం తనకు ఉందని డాక్టర్ ఇందిరా జే పరీఖ్ అన్నారు,బిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విఐటీ-ఎపి యూనివర్సిటీ నిలుస్తుందని ,28 రాష్ట్రాల నుంచి పలు దేశాలు నుండి విద్యార్ధులు మరియు పదిహేను రాష్ట్రాల నుండి ,విదేశి అధ్యాపకులు ఇక్కడ విద్య ని బోధిస్తున్నట్లు విఐటీ-ఎపి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్యా పెంటారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో విఐటీ-ఎపి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శుభకర్, విఐటీ –ఎపి బిజినెస్ స్కూల్ డీన్ డాక్టర్ ఎస్.జయవేలు మరియు విఐటీ-ఎపి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు.

FIRST HAZ FLIGHT