Tuesday, July 31, 2018

విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్

విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్
• విద్య ద్వారానే సమాజంలో మార్పు
• అమరావతి కొద్ది కాలంలోనే విజ్ఞాన కేంద్రం గా మారుతుంది
• విఐటీ –ఎపి యూనివర్సిటీ ప్రధమ సంవత్సర విద్యార్ధుల అవగాహన కార్యక్రమంలో విఐటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్
అమవరావతి:
జీవితంలో కష్టపడటం మరియు నిజాయితీగా ఉండటం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని విఐటీ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్ చెప్పారు.ప్రతిష్టాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయం మిచిగన్ –డియర్ బోర్న్ తో కలిసి విఐటీ –ఎపి ప్రారంబించిన బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు మరియు వివిధ ఇంజనీరింగ్ కోర్సుల మొదటి సంవత్సరం తరగతులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి, ఈ సందర్భంగా మాట్లాడిన విఐటీ యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధన్ డియర్ బోర్న్ యూనివర్సిటీలో ఒప్పందంలో భాగంగా విద్యార్ధులు అమెరికాలో కూడా ఈ కోర్సు చదువుకునే అవకాశం ఉందని రెండు సంవత్సరాలు ఇక్కడ ఒక సంవత్సరం అమెరికాలో చదువుకోవచ్చని దీని కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్ సదుపాయం కూడా ఉందని తెలిపారు,ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ ,ఫ్లేమ్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసిన డాక్టర్ ఇందిరా జే పరీఖ్ ని విఐటీ-ఎపి బిజినెస్ స్కూల్ అడ్వైజర్ గా లిబరల్ ఆర్ట్స్ లో ఇందిరా పరేఖ్ కి ఉన్న అనుభవం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని విఐటీ –ఎపి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాధన్ తెలిపారు.ప్రస్తుతం మార్కెట్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి డిమాండ్ బాగా ఉందని విఐటీ –ఎపి బిజినెస్ స్కూల్ ద్వారా విద్యార్ధుల ఎదుగుదలకు మంచి పునాది పడుతుందన్న నమ్మకం తనకు ఉందని డాక్టర్ ఇందిరా జే పరీఖ్ అన్నారు,బిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విఐటీ-ఎపి యూనివర్సిటీ నిలుస్తుందని ,28 రాష్ట్రాల నుంచి పలు దేశాలు నుండి విద్యార్ధులు మరియు పదిహేను రాష్ట్రాల నుండి ,విదేశి అధ్యాపకులు ఇక్కడ విద్య ని బోధిస్తున్నట్లు విఐటీ-ఎపి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్యా పెంటారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో విఐటీ-ఎపి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శుభకర్, విఐటీ –ఎపి బిజినెస్ స్కూల్ డీన్ డాక్టర్ ఎస్.జయవేలు మరియు విఐటీ-ఎపి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment